Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ దంపతుల భేటీ.. చెన్నైలో ఆసక్తికర పరిణామం!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న దంపతులు తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌తో భేటీ అయ్యారు. 'రణబాలి' సినిమా ప్రచార కార్యక్రమాల కోసం సోమవారం చెన్నైకు వెళ్లిన ఈ జంట.. అదే రోజు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా విజయ్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించి, కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన విశేషాలను విజయ్ దేవరకొండ తన 'ఎక్స్' ఖాతా ద్వారా పంచుకున్నారు. దళపతి విజయ్‌తో అత్యంత అద్భుతమైన సమయాన్ని గడిపానని ఆయన తెలిపారు. రోజంతా అలసిపోయినప్పటికీ తమను ఎంతో ప్రేమగా ఆదరించారని, తన వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నారని పేర్కొన్నారు.
వివరాలు
విజయ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు ఆదర్శనీయం
తొలిసారి కలిసినప్పుడే విజయ్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారని విజయ్ దేవరకొండ వెల్లడించారు. మరోవైపు రష్మిక మందన్న సైతం ఈ భేటీపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించారు.
దళపతి విజయ్‌ను అభిమానించడం మొదలుపెట్టినప్పటి నుంచి, ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందడం వరకు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన తీరును చూసి విస్మయం చెందే వరకు..
ఆయన ప్రస్థానం నిజంగానే అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.విజయ్ ప్రయాణం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోందని రష్మిక తెలిపారు.
ఇలా 'రణబాలి' సినిమా ప్రచారం కోసం చెన్నైకు వెళ్లిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ముఖ్యమంత్రి విజయ్‌ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.