తదుపరి వార్తా కథనం

Vijay Deverakonda-Rashmika:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహానికి ముహూర్తం ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 04, 2025
08:59 am
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవనున్నట్లు సమాచారం. శుక్రవారం హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో ఇరువురు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో జంటగా మెప్పించిన విజయ్-రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Details
నూతన చిత్రంలో నటిస్తున్న రష్మిక, విజయ్
అయితే ఈ సంబంధంపై ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో పంచుకునే పోస్టులు మాత్రం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుతం ఈ జంట దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు.