LOADING...
Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ కారుకు ఉండవల్లి వద్ద ప్రమాదం 
విజయ్‌ దేవరకొండ కారుకు ఉండవల్లి వద్ద ప్రమాదం

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ కారుకు ఉండవల్లి వద్ద ప్రమాదం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
07:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యాడు. మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి పుట్టపర్తికి వెళ్ళి తిరిగి హైదరాబాద్‌కి బయల్దేరిన విజయ్‌ దేవరకొండ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారి, వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకొని వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో, విజయ్‌ దేవరకొండ వాహనం బొలెరోను ఢీకొట్టింది. ఈఘటనలో ఆయన కారు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేకపోవడంతో అందరికీ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఘటన తర్వాత విజయ్‌ దేవరకొండ మరో కారులో సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్లారు.