
VD15: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు రాజా వారి రాణి గారు గుర్తింపు పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఎస్వీసీ సంస్థలో 59వ సినిమా. విజయ్ దేవరకొండతో పాటు కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు.
Details
అక్టోబర్ 16 నుంచి రెగ్యూలర్ షూట్ ప్రారంభం
ముహూర్త సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చినారు, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ చేశారు, డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ అందించారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.