Loading...
Ranabali: 'రణబాలి' షూటింగ్ పూర్తి.. 130 రోజుల తర్వాత గుమ్మడికాయ కొట్టిన చిత్రబృందం
'రణబాలి' షూటింగ్ పూర్తి.. 130 రోజుల తర్వాత గుమ్మడికాయ కొట్టిన చిత్రబృందం

Ranabali: 'రణబాలి' షూటింగ్ పూర్తి.. 130 రోజుల తర్వాత గుమ్మడికాయ కొట్టిన చిత్రబృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' చిత్రీకరణ పూర్తయింది. సుమారు 130 రోజులుగా నిర్విరామంగా కొనసాగిన షూటింగ్‌కు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తన 'ఎక్స్‌' ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. తన టీమ్‌ను 'అలుపెరుగని సైన్యం'గా అభివర్ణించిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

వివరాలు 

రష్మిక పాత్రకు తల్లి పేరు

విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినిమా పనులు పూర్తవుతున్నాయని మూవీ టీమ్ తెలిపింది.

ఇప్పటికే చిత్రంలోని మొదటి భాగానికి సంబంధించిన నేపథ్య సంగీతం (బీజీఎం) కూడా పూర్తయినట్లు వెల్లడించింది.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇదే కావడంతో 'రణబాలి'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో రష్మిక మందన్న 'జయమ్మ' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు తన తల్లి పేరు పెట్టుకున్నట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఇటీవల వెల్లడించారు.

"రణబాలి గుండెల్లో ప్రేమగా, ఆత్మలో స్ఫూర్తిగా, వెన్నెముకలో ధైర్యంగా, అతని పిచ్చిలో మాధుర్యంగా జయమ్మ పాత్ర ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

చారిత్రక వాస్తవాల ఆధారంగా కథ

జయమ్మ పాత్రకు రష్మిక తన నటనతో ప్రాణం పోశారని, ఆ పాత్ర ప్రేక్షకుల జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారని దర్శకుడు ప్రశంసించారు.

19వ శతాబ్దపు నేపథ్యంతో 'రణబాలి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్యకాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ కథను తీర్చిదిద్దినట్లు చిత్రబృందం తెలిపింది.

బ్రిటిష్ పాలకులు చరిత్ర పుస్తకాల్లో తప్పుగా చూపించిన లేదా పూర్తిగా మరుగునపడేలా చేసిన ఎన్నో వాస్తవాలను వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

అయితే, ఈ సినిమా ఏ ఒక్క వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాదని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

చారిత్రక వాస్తవాల ఆధారంగా కథ

చారిత్రక ఆధారాలు, మౌఖిక కథనాలు, అణచివేతకు గురైన రికార్డులను ఆధారంగా చేసుకుని ఆ కాలాన్ని పునర్నిర్మించే ప్రయత్నమే 'రణబాలి' అని చెబుతున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 'రణబాలి' పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, 'ది మమ్మీ' చిత్రంతో గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ.. 'సర్ థియోడర్ హెక్టర్' అనే కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'రణబాలి' చిత్రీకరణ పూర్తి..

ADVERTISEMENT