Ranabali: 'రణబాలి'లో భద్రమల్లన్నగా కనిపించేది ఆ నటుడేనా? ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి
ఈ వార్తాకథనం ఏంటి
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం 'రణబాలి'. దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ ట్రైలర్‌తో పాటు గతంలో విడుదలైన టీజర్‌లో కనిపించిన ఓ ప్రత్యేక పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శింగనమల కొండపై ఉన్న గుహలో ఓ భారీ మనిషిని చూపించడం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది. ఆ పాత్రను తొలుత విజయ్ దేవరకొండే పోషిస్తున్నారని పలువురు భావించారు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలతో ఆ పాత్ర విజయ్ దేవరకొండది కాదనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది.
వివరాలు
భద్రమల్లన్నగా కనిపిస్తున్నది లాలేనా?
ఈ పాత్రలో నటించిన వ్యక్తి ఓ ప్రముఖ నటుడని దర్శకుడు రాహుల్ వెల్లడించినట్లు సమాచారం.
అయితే ఆ నటుడు ఎవరనేది నేరుగా చెప్పకుండా,ప్రేక్షకులే గుర్తించాలని వదిలేశారు.
దీంతో ఈ మిస్టరీ పాత్రపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దృశ్యాలను పరిశీలిస్తే.. 'పందెం కోడి', 'సాహో', ఇటీవల 'ఓజీ' సినిమాల్లో కనిపించిన నటుడు లాల్ ఈ పాత్రలో ఉన్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొస్థెటిక్ మేకప్‌తో కనిపిస్తున్నప్పటికీ,భద్రమల్లన్న పాత్రను లాలే పోషించి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ అంచనాల్లో నిజమెంత? 'రణబాలి'లో భద్రమల్లన్నగా కనిపిస్తున్న నటుడు లాలేనా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఈ నెల 16న ఈ మిస్టరీకి సమాధానం దొరుకుతుందనే ఆసక్తి నెలకొంది.