LOADING...
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్ 
విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు. భారీ అంచనాలపై పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిన తర్వాత, తాజాగా వచ్చిన కింగ్డమ్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆయన నిరాశ చెందారు. అయితే విజయ్ హిట్ కొట్టి తన మార్కెట్ స్థాయి తిరిగి మెరుగుపరుచుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్దన. ప్రముఖ నిర్మాణ సంస్థ SVCబ్యానర్‌లో 49వ సినిమా గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజావరు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. తన తొలి చిత్రాన్ని క్లాస్ గా డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు, ఈ చిత్రాన్ని పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్‌లో తీసుకొస్తున్నారు.

Details

హిరోయిన్ గా కీర్తి సురేష్

మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను దసరా కానుకగా నిర్వహించనున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకోని కారణాల వల్ల పూజా కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు, ఈ నెల 11న పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. 16వ తేదీ నుండి షూట్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ జోడిగా 'కీర్తి సురేష్' నటించబోతోంది. అదనంగా ఆయన యాంటగనిస్ట్ పాత్రకు బాలీవుడ్‌కి చెందిన స్టార్ నటుడిని సంప్రదించడంపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టి, విజయ్ తన మార్కెట్‌ను మరల సంతృప్తికర స్థాయికి తీసుకురావాలని ఉద్దేశించగా, ఫ్యాన్స్ కూడా భారీ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.