Page Loader
The Rajasaab: వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేశాడు.. 'ది రాజాసాబ్' టీజర్‌ రిలీజ్!

The Rajasaab: వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేశాడు.. 'ది రాజాసాబ్' టీజర్‌ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్‌'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాటలు, ఫైట్లు, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ - అన్నీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇది ప్రభాస్‌ తొలి హారర్ రొమాంటిక్ కామెడీ కావడం విశేషం. ఇందులో ప్రభాస్ ఓ వింటేజ్ అవతారంలో కనిపించబోతుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు అభిమానుల నుండి అద్భుత స్పందన లభించింది. కొద్దిసేపటి క్రితం 'ది రాజా సాబ్' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో వింటేజ్ ప్రభాస్ లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ శబాష్ అనిపించేలా ఉంది.

Details

డిసెంబర్ 5న రిలీజ్

టీజర్‌ చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్‌కు ఫ్యాన్స్ నుండి విశేష స్పందన వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక థియేటర్లలో టీజర్‌ స్పెషల్ స్క్రీనింగ్‌ కూడా నిర్వహించారు, అది అభిమానుల్ని మరింత ఉత్సాహంగా ముంచెత్తింది. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.