Page Loader
Vikram : తెలుగు సినిమాల హవాను చూస్తే ఫీలవుతున్నాం : హీరో విక్రమ్
తెలుగు సినిమాల హవాను చూస్తే ఫీలవుతున్నాం : హీరో విక్రమ్

Vikram : తెలుగు సినిమాల హవాను చూస్తే ఫీలవుతున్నాం : హీరో విక్రమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టాలీవుడ్‌ రేంజ్‌ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మన చిత్రాలు దూసుకెళ్తున్నాయి. మిగతా ఇండస్ట్రీల వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుగు చిత్రాల రీచ్ చూసి ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గుర్తు చేశాడు. వీర ధీర శూర ప్రమోషన్స్‌లో విక్రమ్ వ్యాఖ్యలు ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విక్రమ్‌ టాలీవుడ్‌ను కొనియాడాడు. 'టాలీవుడ్‌ను చూస్తే తనకు అసూయగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో గొప్ప కథలు వస్తున్నాయి. పూర్తిగా కమర్షియల్ సినిమాలతో పాటు, కంటెంట్‌ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఈ రెండు రకాల సినిమాలు పెద్ద హిట్లుగా నిలుస్తున్నాయి. ఇంత వైరుధ్యం చాలా అరుదని అన్నాడు.

Details

 తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు 

విక్రమ్‌ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. వాటిని సెలబ్రేట్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితి తమిళంలో కూడా రావాలని కోరుకుంటున్నా. మా సినిమా కొత్తగా ఉంటుంది. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పటిదాకా తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయలేదు. తన దగ్గరికి సరైన స్క్రిప్ట్ రాలేదు. అలాగే భాష సమస్యగా ఉండేదని చెప్పాడు. టాలీవుడ్‌ రేంజ్‌ చూసి కోలీవుడ్‌ హీరోలే ఫీలయ్యే పరిస్థితి వచ్చిందని విక్రమ్ వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేశాయి.