Loading...
Jailer 2: 'జైలర్‌ 2'పై రిస్క్‌ చేశాం.. ఇప్పుడు ఫలితం దక్కింది: నాగవంశీ
'జైలర్‌ 2'పై రిస్క్‌ చేశాం.. ఇప్పుడు ఫలితం దక్కింది: నాగవంశీ

Jailer 2: 'జైలర్‌ 2'పై రిస్క్‌ చేశాం.. ఇప్పుడు ఫలితం దక్కింది: నాగవంశీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌పై నమ్మకంతో 'జైలర్‌ 2' విషయంలో రిస్క్‌ చేశామని.. ఇప్పుడు ప్రేక్షకులు అందించిన విజయంతో దానికి తగిన ప్రతిఫలం దక్కుతుండటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. విజయవంతమైన 'జైలర్‌'కు కొనసాగింపుగా రజనీకాంత్‌ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కలయికలో తెరకెక్కిన చిత్రమే 'జైలర్‌ 2'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా ఈ సినిమా ఇటీవలే తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ రావడం చాలా అరుదైపోయింది.

వివరాలు

చాలా ఆనందంగా ఉంది

'జైలర్‌ 2'ను భారీ ధరకు కొనుగోలు చేశామని మొదట్లో అందరూ భయపడ్డారు. అయితే సినిమా విడుదలైన రోజే వచ్చిన వసూళ్లను చూసిన తర్వాత కచ్చితంగా కమీషన్‌ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం మాకు ఎంతో ప్రశాంతతనిచ్చింది.

ఈ సినిమాలో రజనీకాంత్‌ స్టైల్‌, స్వాగ్‌, యాక్షన్‌, అనిరుధ్‌ సంగీతం, మూర్తి పాత్ర అందించే వినోదానికి ప్రేక్షకులంతా కనెక్ట్‌ అవుతున్నారు.

రానున్న రోజుల్లో ఈ చిత్రం మరింత భారీ వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నా. రజనీకాంత్‌, నెల్సన్‌, అనిరుధ్‌లను నమ్మి ఈ సినిమా విషయంలో రిస్క్‌ చేశాం. ఇప్పుడు ప్రేక్షకులు అందించిన విజయంతో దానికి ప్రతిఫలం దక్కుతుండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

వివరాలు

'ఆదర్శ కుటుంబం' విడుదల తేదీపై నాగవంశీ స్పష్టత

మరో నిర్మాత మైత్రి శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. విజయదశమి నాటికే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించి లాభాల బాటలోకి వస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు.

కథానాయకుడు వెంకటేశ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం-47'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విడుదల తేదీపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే అందరికీ తెలిసిన తేదీకే ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ విషయాన్ని నేను చెబితే ఇప్పుడు ఎవరూ నమ్మేలా లేరు.

ADVERTISEMENT

వివరాలు

చిట్టిబాబు పాత్రలో వెంకటేష్

అందుకే ఈ నెల 21 లేదా 22న ట్రైలర్‌ను విడుదల చేసి, వెంకటేశ్‌తోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటింపజేస్తామని వెల్లడించారు.

వినోదం, యాక్షన్‌, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేశ్‌ 'చిట్టిబాబు' పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ నెల 19న 'మాల..' అంటూ సాగే చిత్రంలోని రెండో పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం చిత్రబృందం ట్రైలర్‌ విడుదలకు సిద్ధమవుతోంది.

ADVERTISEMENT