
Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి ప్రియదర్శన్ వెండితెరకు పరిచయమైంది.
తెలుగులో తన తొలి చిత్రం అక్కినేని అఖిల్ నటించిన 'హలో' కాగా, ఇది విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.
కొంత కాలం తర్వాత, సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజతో నటించిన 'చిత్రలహరి' ద్వారా ఆమె సూపర్ హిట్ అందుకుంది.
ఇక శర్వానంద్‌తో చేసిన 'రణరంగం' సినిమా ప్లాప్ అయిన తర్వాత, ఆమె టాలీవుడ్ కు దూరమైంది .
ప్రస్తుతం, తమిళ, మలయాళ చిత్రాలలో వరుస విజయాలతో కళ్యాణి ప్రియదర్శన్ మంచి ఊపు మీద ఉంది. ఈ మధ్య ఆమె షేర్ చేసిన ఒక వీడియో అభిమానులకు షాకిచ్చింది.
Details
ప్రకటన కోసమే ఆ వీడియో తీశాం
తమిళ బుల్లితెరలో కస్తూరీమాన్ సీరియల్ ద్వారా ప్రసిద్ధి చెందిన శ్రీరామ్‌ను పెళ్లి బట్టలలో దర్శనమిస్తూ వీడియోను పంచుకుంది.
ఈ వీడియోపై శ్రీరామ్ 'అవును. ఈ క్షణాలు మమ్మల్ని సంతోషపరుస్తాయంటూ క్యాప్షన్ రాశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, కళ్యాణి ప్రియదర్శన్, శ్రీరామ్ వధూవరులుగా ఓ యాడ్ లో నటించారు.
యస్ భారత్ వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం ఒక ప్రకటన కోసం ఆ వీడియో తీశామని, వేరే ఎలాంటి విషయం లేదని శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఇక మలయాళ నటుడు మోహన్లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ కలిసి నటించిన 'హృదయం' ఈ భామ కెరీర్‌లో అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది.