LOADING...
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్‌'కు పవన్ క‌ళ్యాణ్‌ రెమ్యునరేషన్ ఎంతంటే..?
'ఉస్తాద్ భగత్‌సింగ్‌'కు పవన్ క‌ళ్యాణ్‌ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్‌'కు పవన్ క‌ళ్యాణ్‌ రెమ్యునరేషన్ ఎంతంటే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ హీరోగా నటించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి హ‌రిష్ శంక‌ర్‌ దర్శకత్వం వహించారు. గతంలో పవన్ క‌ళ్యాణ్ తో కలిసి ఆయన రూపొందించినగబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

హీరోయిన్లుగా శ్రీలీల‌, రాశీ ఖ‌న్నా

సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల‌, రాశీ ఖ‌న్నా నటించారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతాన్ని దేవీశ్రీ ప్ర‌సాద్‌ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను త‌మ‌న్ ఎస్‌ సమకూర్చారు. స్టార్ క్యాస్టింగ్, పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రాకర్ వివరాల ప్రకారం, ఈ చిత్రానికి పవన్ క‌ళ్యాణ్‌ సుమారు రూ.25 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వందల కోట్ల పారితోషికం తీసుకునే పవన్, మైత్రీ మూవీ మేకర్స్‌తో ఉన్న అనుబంధం కారణంగా తక్కువ పారితోషికంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు సమాచారం.

Details

రాశీ ఖ‌న్నాకు  రూ.1.5కోట్లు రెమ్యునరేషన్

ముఖ్యంగా తన చారిత్రాత్మక యాక్షన్ చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుదల విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ అందించిన సహకారానికి ప్రతిగా పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆలస్యమైన నేపథ్యంలో నిర్మాతలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకోసం శ్రీలీల‌ సుమారు రూ.2.5నుంచి 3కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ రాశీ ఖ‌న్నా దాదాపు రూ.1.5కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది.

Advertisement