
Aamir Khan-Gauri Spratt: ఆమిర్‌ఖాన్‌తో డేటింగ్ చేసే గౌరీ స్ప్రాట్ ఎవరు ..?
ఈ వార్తాకథనం ఏంటి
తన పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan)ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
గత ఏడాదిన్నరగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్(Gauri Spratt)తో డేటింగ్‌లో ఉన్నానని తెలిపారు.
అంతేకాకుండా,ఆమెను మీడియా ముందు పరిచయం చేశారు. ఈ పరిణామంతో గౌరీ స్ప్రాట్ ఎవరు? అనే విషయంలో ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది.
గౌరీ స్ప్రాట్ ఎవరు?
ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న గౌరీ స్ప్రాట్ ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె. వారి కుటుంబానికి బెంగళూరులో ఓ సెలూన్ ఉంది.
ఆమె విద్యాబ్యాసం బ్లూ మౌంటెన్ స్కూల్‌లో పూర్తి చేసిన తర్వాత ఫ్యాషన్ కోర్సు చేశారు.లండన్ యూనివర్సిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీ కోర్సులో శిక్షణ పొందారు.
వివరాలు
ఆమిర్ - గౌరీ బంధం
ప్రస్తుతం ముంబయిలో "బీబ్లంట్" అనే సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు అక్కడకు వెళ్తుంటారు.
గౌరీ కొంతకాలంగా ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తున్నారు.
వీరి స్నేహబంధం 25 ఏళ్లుగా కొనసాగుతోంది. దాదాపు 18 ఏళ్లుగా డేటింగ్ చేస్తుండగా, ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదు.
దీనిపై ఆమిర్ స్పందిస్తూ - "గౌరీ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటుంది. ఆమెను కలిసేందుకు నేను అక్కడికే వెళ్తుంటా. అక్కడ మీడియా అటెన్షన్ తక్కువగా ఉంటుంది, అందుకే మా రిలేషన్ గురించి ఎవరూ తెలుసుకోలేదు" అని వెల్లడించారు.
వివరాలు
బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి తక్కువ: గౌరీ
ఆమిర్ తెలిపిన వివరాల ప్రకారం, గౌరీ హిందీ సినిమాలు ఎక్కువగా చూడదు.
"ఆమె ఇప్పటివరకు నేను నటించిన 'లగాన్', 'దంగల్', 'దిల్ చాహ్తాహై' మాత్రమే చూసింది. నేను దర్శకత్వం వహించిన 'తారే జమీన్ పర్' సినిమా ఆమెకు చూపించాలని అనుకుంటున్నా.
అయితే, నేను పాడే పాటలు మాత్రం ఆమెకి ఇష్టం. వీలైనప్పుడల్లా ఆమె కోసం పాటలు పాడుతుంటా" అని ఆమిర్ చెప్పుకొచ్చారు.
కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం
ఆమిర్ ఖాన్ కుటుంబ సభ్యులకు గౌరీ గురించి తెలిసి చాలా కాలమే అయింది. వారు ఇద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఇటీవల తన ప్రీ బర్త్‌డే పార్టీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కి కూడా గౌరీని ప్రత్యేకంగా పరిచయం చేసినట్లు చెప్పారు.
వివరాలు
వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు
తమ వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా కొనసాగేలా ఆమిర్ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే గౌరీ కోసం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
గౌరీ గతంలో వివాహం చేసుకుంది. అయితే, భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.