Loading...
Ramayana Full Cast: 'రామాయణ'లో ఎవరు ఏ పాత్రలో..? రణ్‌బీర్ నుంచి యశ్ వరకు పూర్తి స్టార్‌కాస్ట్ ఇదే!
'రామాయణ'లో ఎవరు ఏ పాత్రలో..? రణ్‌బీర్ నుంచి యశ్ వరకు పూర్తి స్టార్‌కాస్ట్ ఇదే!

Ramayana Full Cast: 'రామాయణ'లో ఎవరు ఏ పాత్రలో..? రణ్‌బీర్ నుంచి యశ్ వరకు పూర్తి స్టార్‌కాస్ట్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు తెరపై చూసినా కొత్త అనుభూతిని కలిగించే భారతీయ ఇతిహాసం 'రామాయణం'. ఇప్పుడు ఈ మహాకావ్యం అత్యాధునిక సాంకేతికతతో, భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా, తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల చిత్రబృందం 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో ప్రచార వీడియోను విడుదల చేయగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ' ట్రైలర్ జూలై 24న విడుదల కానుంది.

వివరాలు

అయోధ్య పాత్రల్లో ఎవరు?

వాల్మీకి మహర్షి రచించిన 'రామాయణం'లో ప్రతి పాత్రకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

అందుకే సినిమాలో ఏ నటుడు ఏ పాత్రలో కనిపించనున్నాడనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రచార వీడియోతో పాత్రలపై మరింత స్పష్టత వచ్చింది.

శ్రీరాముడిగా - రణ్‌బీర్ కపూర్

సీతాదేవిగా - సాయి పల్లవి

లక్ష్మణుడిగా - రవి దూబే

భరతుడిగా - ఆదినాథ్ కొఠారే

శతృఘ్నుడిగా - నితీశ్ శర్మ

ఒకప్పుడు రామానంద్ సాగర్ రూపొందించిన టెలివిజన్ 'రామాయణం'లో శ్రీరాముడి పాత్రతో చిరస్థాయిగా గుర్తింపు పొందిన అరుణ్ గోవిల్, ఈ సినిమాలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు

రావణ రాజ్యంలో కీలక పాత్రలు

అలాగే కౌసల్య - ఇందిరా కృష్ణన్కై

కేయి - లారా దత్తా

సుమిత్ర - సోనల్ ఝా

మంధర - సీబా చద్దా

వశిష్ఠ మహర్షి - శిశిర్ శర్మ

విశ్వామిత్ర మహర్షి - అజింక్య దేవ్

రావణ రాజ్యంలో కీలక పాత్రలు ఈ చిత్రంలో లంకాధిపతి రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు.

తొలి భాగంలో ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం. రెండో భాగంలో రామ-రావణ యుద్ధం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

రావణుడి తల్లి కైకసి - శోభన

మండోదరి-కాజల్ అగర్వాల్

శూర్పణఖ-రకుల్ ప్రీత్ సింగ్

విభీషణుడు - హరీశ్ ఉత్తమన్

కుంభకర్ణుడు - ఫైసల్ మాలిక్

విద్యుత్‌జిహ్వుడు (శూర్పణఖ భర్త) - వివేక్ ఒబెరాయ్

ADVERTISEMENT

వివరాలు

హనుమంతుడిగా సన్నీ డియోల్

రామాయణంలో అత్యంత కీలకమైన హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు.

అలాగే... ఇంద్రుడు - కునాల్ కపూర్

అగస్త్య మహాముని - ముకేశ్ తివారి

మారీచుడు - సౌరబ్ సచ్‌దేవ్

తాటకి - కాంచన్ చేతన్

జటాయువుకు అనుపమ్ ఖేర్ వాయిస్

జటాయువు పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తారనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అనుపమ్ ఖేర్ ఈ పాత్రకు వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది.

భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విజువల్ గ్రాండియర్‌తో రూపొందుతున్న 'రామాయణ'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

జూలై 24న విడుదల కానున్న ట్రైలర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT