Toxic : యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరు?.. టాక్సిక్ టీజర్ సెన్సేషన్!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యశ్‌ను 'రాయ్' అనే ఊరమాస్, డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూడడం ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం యశ్‌తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్‌లో అతనితో నటించిన ఆ విదేశీ భామ ఎవరోనేదానిపై నెట్టింట చర్చలు విస్తరించాయి. ఆమె హాలీవుడ్ నటి, మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు నటాలీ బర్న్. ఉక్రెయిన్ మూలాల ఈ బ్యూటీ 'ది ఎక్స్‌పెండబుల్స్ 3', 'మెకానిక్: రిసరెక్షన్' వంటి భారీ యాక్షన్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
Details
మార్చి 19న మూవీ రిలీజ్
నటిగా మాత్రమే కాకుండా, మోడల్, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాతగా కూడా మంచి గుర్తింపు కలిగిన నటాలీ, సుమారు 150 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉంది. 'టాక్సిక్' ద్వారా ఆమె ఇండియన్ స్క్రీన్‌పై అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఈ చిత్రానికి ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించినప్పటికీ, టీజర్‌లో నటాలీ బర్న్చూ పించిన గ్లామర్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుందని, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.