Loading...
Spirit : 'స్పిరిట్' పోస్ట్‌పోన్‌ అవుతుందా?.. అసలు నిజం చెప్పిన సందీప్ రెడ్డి వంగా!
'స్పిరిట్' పోస్ట్‌పోన్‌ అవుతుందా?.. అసలు నిజం చెప్పిన సందీప్ రెడ్డి వంగా!

Spirit : 'స్పిరిట్' పోస్ట్‌పోన్‌ అవుతుందా?.. అసలు నిజం చెప్పిన సందీప్ రెడ్డి వంగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై హైప్ నెలకొనగా, తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన అప్‌డేట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా పురోగతిపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "స్పిరిట్ షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లో 40 శాతం పూర్తైంది.

వివరాలు

2027 మార్చి 5న రిలీజ్

మిగిలిన 60 శాతం చిత్రీకరణను కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసి, ముందుగా ప్రకటించిన తేదీకే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

సందీప్ తాజా వ్యాఖ్యలతో ఆ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

'స్పిరిట్'లో ప్రభాస్ తొలిసారిగా అత్యంత పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

వివరాలు

'ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్'గా మూవీ

ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో 'ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్'గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ADVERTISEMENT