LOADING...
Peddi: 'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా..? రామ్ చరణ్ మూవీపై సందేహాలు!
'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా..? రామ్ చరణ్ మూవీపై సందేహాలు!

Peddi: 'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా..? రామ్ చరణ్ మూవీపై సందేహాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం షూటింగ్ వేగంగా సాగుతున్నప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనైనా 2026 మార్చి 27న సినిమా విడుదల చేయాలని టీమ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు రాగానే మెగా అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఇప్పటికే విడుదలైన 'పెద్ది' ఫస్ట్ షాట్, అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన 'చికిరి సాంగ్'కు అద్భుతమైన స్పందన లభించింది.

Details

మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

అన్ని భాషల్లోనూ ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తూ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్‌ను మేకర్స్ ఇప్పటికే ఫైనల్ చేశారు. థియేట్రికల్ హక్కుల కోసం కూడా మంచి పోటీ నెలకొంది. అయినా కూడా షూటింగ్ డిలే కారణంగా చిత్రాన్ని వాయిదా వేసే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ మాత్రం మేకర్స్ అధికారికంగా ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త మెగా ఫ్యాన్స్‌ను కొంతవరకు నిరుత్సాహపరుస్తోంది.