Page Loader
Prabhas:'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్‌ ప్రస్థానమిదే! 
'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్‌ ప్రస్థానమిదే!

Prabhas:'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్‌ ప్రస్థానమిదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ రంగంలో ప్రభాస్‌ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే అంశాలు అతని 'బాహుబలి' వంటి భారీ చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప నటన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం, సహ నటులకు ఇచ్చే ఆతిథ్యం ప్రభాస్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. హీరోగా ఆయన సాధించిన రికార్డులు అందరికీ బాగా తెలుసు. కానీ విద్యార్థి దశలో ప్రభాస్‌ ఎలా ఉన్నారు? సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? ఈ విశేషాలు తెలియని వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన 45వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Details

విద్యార్థి దశలో ప్రభాస్‌ 

ప్రభాస్‌ విద్యార్థిగా చాలా సరదాగా ఉండేవారట. అతను సాధారణ విద్యార్థినే. తరగతి గదిలో ఎక్కువసేపు కూర్చోవడం తనకు ఇష్టం ఉండేది కాదు. డ్రిల్ పీరియడ్‌ కోసం ఎదురుచూసేవాడిని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. క్రీడలు పట్ల ఆసక్తి ఎక్కువగా లేకపోయినా, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ ప్రభాస్‌కి ఇష్టమైన ఆటలు. పాఠశాల రోజుల్లో స్నేహితులు ఆయనను గజినీలా చూస్తుండేవారు. ఎందుకంటే చాలా సార్లు పెన్ను మర్చిపోయి పరీక్షలకు వెళ్ళేవారట. ఇప్పుడు ఆ అలవాట్లు కొంచెం తగ్గించుకున్నాని ప్రభాస్ పేర్కొన్నారు.

Details

 సినీ రంగ ప్రవేశం 

ప్రభాస్‌ సినీ రంగ ప్రవేశం కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. 'నేను హీరో అవుతానని ఒక రోజు తన స్నేహితులకు చెప్పినపుడు, వాళ్లు నన్ను నవ్వుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత, ప్రభాస్‌ నటనలో శిక్షణ తీసుకునేందుకు సత్యానంద్‌గారి వద్ద మూడు నెలలు పాటు శిక్షణ పొందారు. అయితే, ఫైట్స్‌, డ్యాన్స్‌లో శిక్షణ పొందలేకపోయారని ఆయన తెలిపారు. 2002లో విడుదలైన 'ఈశ్వర్‌' సినిమాతో ప్రభాస్‌ హీరోగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు.

Details

 హైట్‌ గురించి ఏమి చెప్పారంటే

19 ఏళ్ల వయసులోకే తన హైట్‌ గురించి చుట్టుపక్కల వారు ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందని ప్రభాస్‌ చెప్పారు. కానీ, తన కెరీర్‌కి హైట్‌ ఓ ప్రధానమైన అంశమైందని, పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే స్పష్టమైంది. ఇక బుజ్జిగాడు సినిమాలో కొత్తగా కనిపించడానికి ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన తన స్నేహితుడితో కలిసి మిలాన్‌ (ఇటలీ) వెళ్లి అక్కడ ఫ్యాషన్‌లో మెలకువలు నేర్చుకున్నారు. 'డార్లింగ్‌' అనిపించుకోవడం ఎరినైనా పిలవాల్సివస్తే 'భయ్యా, అన్నా' అని పిలవడం ప్రభాస్ ఇబ్బందిగా అనిపించిందట. అందుకే అందర్నీ 'డార్లింగ్‌' అని పిలుస్తుంటాడు ప్రభాస్‌. 'బుజ్జిగాడు' సినిమాతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ పదాన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేశారు.

Details

దక్షిణాదిలో తొలి హీరోగా గుర్తింపు

ప్రభాస్‌ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహం పొందిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు పొందారు. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో నటించడం ఆయన కలగా ఉంది. నటుడు కాకపోయుంటే, హోటల్‌ రంగంలో స్థిరపడేవాడనేది మరొక ఆసక్తికర విషయంగా చెప్పాడు. పెళ్లి ఎప్పుడంటే తన అభిమానులు ఎప్పుడూ అడిగే ప్రశ్న 'ప్రభాస్‌ పెళ్లెప్పుడు?' ఈ ప్రశ్నకు ఇంకా తేలికైన సమాధానం ఇవ్వని ఆయన, ఈ విషయంపై ఎప్పుడూ హాస్యంతో స్పందిస్తూ ఉంటారు.