Toxic : యష్ 'టాక్సిక్' టీజర్ వచ్చేసింది.. థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగానే చెప్పినట్టే, ఈ టీజర్ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. టీజర్‌లో కనిపించిన హింసాత్మక సన్నివేశాలు, మేకింగ్ స్టైల్ చూస్తే ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Details
విజువల్స్ పరంగా కొన్ని షాట్స్ అద్భుతం
ముఖ్యంగా యష్ బాడీ లాంగ్వేజ్, లుక్స్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా వైల్డ్‌గా, రఫ్‌గా కనిపిస్తున్నాయి. టీజర్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. రవి బాసృర్ అందించిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ అదిరిపోయే అనుభూతిని ఇస్తోంది. విజువల్స్ పరంగా కొన్ని షాట్స్ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ సినిమాకు తగ్గట్టుగా డార్క్ ఇంటెన్స్ టోన్‌లో ఉన్నాయి. మొత్తానికి 'కేజీఎఫ్' తర్వాత యష్ నుంచి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.