Loading...
The Paradise : 'యెషనాగుల' వచ్చేస్తోంది.. 'ది ప్యారడైజ్'లో నాని ఊరమాస్ ట్రీట్
'యెషనాగుల' వచ్చేస్తోంది.. 'ది ప్యారడైజ్'లో నాని ఊరమాస్ ట్రీట్

The Paradise : 'యెషనాగుల' వచ్చేస్తోంది.. 'ది ప్యారడైజ్'లో నాని ఊరమాస్ ట్రీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మరో సర్‌ప్రైజ్‌ను ప్రకటిస్తూ సెకండ్ సింగిల్‌ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. 'ది ప్యారడైజ్'లోని #YESHANAGULA (యెషనాగుల) పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నారు.

వివరాలు

స్వరాలను సమకూర్చనున్న అనిరుధ్

ఈ ఊరమాస్‌ ట్రాక్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు.

ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. జంగి రెడ్డి, ప్రభ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన చిన్న మ్యూజిక్ క్లిప్‌ను శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ క్లిప్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 'యెషనాగుల' క్లిప్‌ వైరల్‌గా మారింది.

దీంతో పూర్తి పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 29న సెకండ్ సింగిల్‌ విడుదల కానుండటంతో 'ది ప్యారడైజ్‌'పై అంచనాలు మరింత పెరిగాయి.

ADVERTISEMENT