
ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ
ఈ వార్తాకథనం ఏంటి
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.
2022లో నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసుకు వ్యవహారంలో పీటీ వారెంట్ పిటీషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు వారెంట్ జారీ చేయాలని సీఐడీ తన పిటీషన్‌లో కోరింది.
మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
లింగమనేని రమేశ్‌కు, ఆయన కంపెనీలకు మేలు జరిగేలా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఉద్దేశపూర్వకంగానే ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరిన సీఐడీ
ఏసీబీ కోర్టులో చంద్రబాబు పై ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2023
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్. చంద్రబాబును విచారించాలని కోరిన ఏపీ ప్రభుత్వం. pic.twitter.com/6ohoavE4EJ