
నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో 61 ఏళ్ల మహిళా లాయర్ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులుతెలిపారు.
సుప్రీంకోర్టు లాయర్ రేణు సిన్హా,తన భర్త నితిన్ నాథ్ సిన్హా తో కలిసి నోయిడా సెక్టార్ 30లోని ఓ బంగ్లాలో ఉంటున్నారు.
అయితే గత రెండు రోజులుగా రేణు సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అంతేకాకుండా తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉండచ్చని ఆరోపించాడు.
Details
36 గంటల పాటూ స్టోర్‌రూమ్ లో దాక్కున్న భర్త
రంగంలోకి దిగిన పోలీసులు లాయర్ బంగ్లాలోని బాత్రూమ్‌లో ఆమె మృతదేహం వెలికితీశారు.
ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆమె భర్త నితిన్ జాడ కనిపించకపోవడంతో అతడి కోసం గాలించిన పోలీసలు చివరిక అతని ఫోన్ నంబర్ ను ట్రాక్ చేయగా.. అది లాయర్ ఉన్న బంగ్లా లోనే చూపించింది.
దీంతో పోలీసులు బంగ్లా మొత్తంవెతికి .. చివరికి అతనిని స్టోర్‌రూమ్‌లో వెతికి పట్టుకున్నారు.
ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటల పాటూ స్టోర్‌రూమ్‌లోనే దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు.