Loading...
Bhogapuram Airport: విద్యార్థులకు సువర్ణావకాశం.. భోగాపురం విమానాశ్రయానికి స్లోగన్ రాస్తే రూ.లక్ష బహుమతి
విద్యార్థులకు సువర్ణావకాశం..

Bhogapuram Airport: విద్యార్థులకు సువర్ణావకాశం.. భోగాపురం విమానాశ్రయానికి స్లోగన్ రాస్తే రూ.లక్ష బహుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భోగాపురం విమానాశ్రయానికి ఆకట్టుకునే తెలుగు స్లోగన్ రూపొందించిన విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం పోషించే పాత్ర, దాని ఆశయాలు, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా స్లోగన్ ఉండాలని సూచించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చని చెప్పారు. స్లోగన్‌తో పాటు విద్యార్థి పేరు, చదువుతున్న తరగతి, పూర్తి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్ వివరాలను airportslogan@gmail.com ఈ-మెయిల్‌కు లేదా 94407 49687 వాట్సాప్ నంబర్‌కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాలని సూచించారు. పంపిన స్లోగన్‌లలో ఉత్తమంగా ఎంపికైన ఒక్క స్లోగన్‌కే రూ.లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

ADVERTISEMENT