Page Loader
Telangana: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు 
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

Telangana: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 14, 2023
07:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పలువురు అధికారులు,ఐఏఎస్ బదిలీలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శైలజా రామయ్యర్ ఆరోగ్య శాఖ కమిషనర్ గా నియమితులయ్యారు. శైలజా రామయ్యర్ ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. ముర్తుజా రిజ్వీని ఇంధన శాఖ కార్యదర్శిగా.. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్.. ముషరప్ అలీ ఫరూక్ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమితులయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణలో IAS అధికారుల బదిలీలు