Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు
దిల్లీ మహిళా కమిషన్ ఉద్యోగులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా తొలగించారు. ఎల్జీ ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగించింది. వాస్తవానికి, ఈ ఉద్యోగులందరూ ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ద్వారా నియమించబడిన ఉద్యోగులు. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అనుమతి లేకుండా వారిని నియమించారని ఆరోపించారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా స్వాతి మలివాల్ రాజీనామా
ఈ క్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ చట్టాన్ని ఉదహరించారు. కమిషన్‌లో కేవలం 40 పోస్టులు మాత్రమే మంజూరయ్యాయని, కాంట్రాక్ట్‌పై ఉద్యోగులను నియమించుకునే హక్కు డీసీడబ్ల్యూకి లేదని పేర్కొంది. ఢిల్లీ మహిళా కమిషన్ విభాగం అదనపు డైరెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులో, కొత్త నియామకాలకు ముందు, అవసరమైన పోస్టుల మూల్యాంకనం జరగలేదని లేదా అదనపు ఆర్థిక భారం కోసం అనుమతి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2017లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ.. ఈ ఏడాది జనవరి 5న ఆమె తన పదవికి రాజీనామా చేశారు.