Loading...
Supreme Court: అరెస్టు కాదు.. నిర్బంధం నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు 
అరెస్టు కాదు.. నిర్బంధం నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు

Supreme Court: అరెస్టు కాదు.. నిర్బంధం నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా,ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న సమయం నుంచే ఈ గడువును లెక్కించాలని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం, నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం తప్పనిసరి అని పేర్కొంది. 2025లో ఓ డ్రగ్ స్మగ్లర్ అరెస్టుకు సంబంధించిన కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్,జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిర్బంధంలోకి తీసుకున్న 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే, ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

వివరాలు 

కోర్టు ఆదేశాలు

అరెస్టు, నిర్బంధం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉపయోగించి రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదని పేర్కొంది.

ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న సమయం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుంది.

అరెస్టు చేసిన సమయం నుంచి ఈ గడువును లెక్కించకూడదు. నిర్బంధించిన 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.

ఈ గడువులో మెజిస్ట్రేట్ వద్దకు చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయాన్ని మినహాయించవచ్చు.

వివరాలు 

బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 58 ప్రకారం నిర్బంధం

ఆర్టికల్ 22(2) కింద అదనపు గడువు కల్పించేలా ఎలాంటి బఫర్ పీరియడ్‌ను సృష్టించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 58 ప్రకారం నిర్బంధం జరగాలని తెలిపింది. నిర్బంధించిన తేదీ, సమయాన్ని మెజిస్ట్రేట్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది.

నిర్బంధించిన సమయం నుంచి 24 గంటల గడువు ముగిసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే, నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు మెజిస్ట్రేట్ నిరాకరించవచ్చని ధర్మాసనం వెల్లడించింది.

ADVERTISEMENT