Page Loader
Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 
Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ

Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 

వ్రాసిన వారు Stalin
Feb 28, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ నేవీ సంయక్తంగా గుజరాత్‌ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ నుంచి బోటులో వస్తున్న దాదాపు 3, 300 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో ఇప్పటి వరకు చేసిన మాదక ద్రవ్యాల రికవరీ ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. తాజాగా పట్టుకున్న డ్రగ్స్ మార్కెట్‌లో వీరి విలువ రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు పాకిస్థాన్, ఇరాన్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేసారు. వీరిని గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలించారు.

గుజరాత్

నిందితులను విచారిస్తున్న ఏజెన్సీలు

అరెస్టు చేసిన నిందితుల నుంచి డ్రగ్స్ ఎక్కడికి తరలిస్తున్నారు? యజమాని ఎవరనే సమాచారాన్ని భద్రతా సంస్థలు సేకరిస్తున్నాయి. అరెస్టయిన వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న 3,300 కిలోల డ్రగ్స్‌లో 2,950 కిలోల హషీష్, మిగతాది మెథాంఫెటమైన్, మార్ఫిన్ డ్రగ్స్‌గా అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే, పట్టుకున్న మాదక ద్రవ్యాల వివరాలను వెల్లడించేందుకు ఎన్‌సీబీ బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఈ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. భారీగా డ్రగ్స్‌ను పట్టుకోడవంపై ఎన్‌సీబీ, ఇండియన్ నేవీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు.