Page Loader
Noida: గుడిసెలో మంటలు చెలరేగి ముగ్గురు బాలికలు మృతి 
గుడిసెలో మంటలు చెలరేగి ముగ్గురు బాలికలు మృతి

Noida: గుడిసెలో మంటలు చెలరేగి ముగ్గురు బాలికలు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2024
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

నోయిడాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సెక్టార్-8లోని ఫేజ్ వన్ ప్రాంతంలోని ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో ముగ్గురు బాలికలు మరణించారు. ఘటన సమయంలో ముగ్గురు బాలికలు తమ తల్లిదండ్రులతో కలిసి గుడిసెలో నిద్రిస్తున్నారని పోలీసులు తెలిపారు. అప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు.

వివరాలు 

ఈ-రిక్షా బ్యాటరీ చార్జింగ్‌ చేస్తుండగా ప్రమాదం  

మృతి చెందిన బాలికలను 10 ఏళ్ల ఆస్తా, 7 ఏళ్ల నైనా, 5 ఏళ్ల ఆరాధ్యగా గుర్తించారు. బాలికల తండ్రి ఈ-రిక్షా నడిపేవారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి తండ్రి రిక్షా బ్యాటరీకి చార్జింగ్ పెట్టి కుటుంబమంతా ఒకే గదిలో పడుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో గదిలో నిద్రిస్తున్న బాలికలు మృతి చెందగా, తల్లిదండ్రులకు మంటలు అంటుకున్నాయి.

వివరాలు 

పెను ప్రమాదం తప్పింది 

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 10 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో సమీపంలోని పలు గుడిసెలు మంటల్లో చిక్కుకునే అవకాశం ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.