Inter Syllabus: ఇంటర్ కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్ తగ్గింపు.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపడుతోంది.
సిలబస్‌ను సవరించి, భారం తగ్గించే ప్రక్రియలో ఉంది. ముఖ్యంగా కెమిస్ట్రీ సబ్జెక్టులో 30 శాతం పాఠ్యాంశాన్ని తొలగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
జువాలజీ సిలబస్‌లో సైతం మార్పులు చేయాలని ఆలోచిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ ఎస్సీఈఆర్టీ (సీబీఎస్‌ఈ) సిలబస్ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.
ముఖ్యంగా కెమిస్ట్రీ సిలబస్ విద్యార్థులకు పెద్ద భారం అవుతోంది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Details
త్వరలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సమావేశం
ఈ అంశంపై విద్యావేత్తలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సిలబస్‌లో 30 శాతం కోత పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే సవరించాల్సిన పాఠ్యాంశాలను షార్ట్‌లిస్ట్ చేసింది.
త్వరలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సమావేశమై ఈ మార్పులను తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి.
ఇంకా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, కరోనా మహమ్మారిపై ప్రత్యేక పాఠ్యాంశాన్ని కూడా చేర్చాలని భావిస్తోంది.