Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధానిలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆరోగ్యశాఖలో ఆప్ సర్కారం రూ.382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లీకైన నివేదికలోని వ్యత్యాసాలను ఉద్దేశిస్తూ, ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ 14 CAG నివేదికలను ప్రస్తావించారు.
అవినీతిపై పోరాటం చేస్తామని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతిలో కలిసిపోయారని మాకెన్ విమర్శించారు.
దిల్లీ మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం చవిచూసిందని CAG నివేదిక పేర్కొంది. ఆప్ నేతలు తమ అక్రమాలను అసెంబ్లీలో బయటపడ్డప్పుడు నివేదికలు ఆమోదించకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు.
Details
నిధులను వినియోగించడంలో విఫలం
కొవిడ్ మహమ్మారి సమయంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో 56 శాతం నిధులు ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం వినియోగించకుండా ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచడానికి ఏ చర్యలు తీసుకోలేదని, CAG తనిఖీలో ఆసుపత్రుల్లో సిబ్బంది, పడకల కొరతను గుర్తించిందని చెప్పారు.
గత పదేళ్లలో దిల్లీలో కేవలం మూడు ఆసుపత్రులు మాత్రమే నిర్మించారని, అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో శంకుస్థాపన చేసినవని పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ ఆస్పత్రి నిర్మాణానికి టెండర్ కంటే రూ.314 కోట్ల అధికంగా ఖర్చు చేశారన్నారు. బురారీ ఆస్పత్రికి రూ.41 కోట్లు, మౌలానా ఆజాద్ డెంటల్ ఆస్పత్రికి రూ.26 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్టు తెలిపారు.