Salmankhan: సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పన్వేల్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు ANI తెలిపింది.
నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ఆయుధ సరఫరాదారు నుండి ఆయుధాలను ఆర్డర్ చేసే ప్రణాళిక ఉంది. లారెన్స్ బిష్ణోయ్,అన్మోల్ బిష్ణోయ్,సంపత్ నెహ్రా,గోల్డీ బ్రార్ సహా 17 మందికి పైగా వ్యక్తులపై FIR నమోదైంది.
తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సల్మాన్ కు లారెన్స్ బిష్ణోయ్ నుంచి చాలాకాలంగా ముప్పు వుంది.
2000వ దశకంలో రాజస్ధాన్ లో కృష్ణ జింకలను సల్మాన్‌ఖాన్ హతమార్చాడని బిష్ణోయ్ గుర్రగా వున్నాడు.
అవకాశం దొరికితే ఎప్పుడైనా ప్రాణాలు తీస్తానని లారెన్స్ ముఠా తరచుగా బెదిరిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిష్ణోయ్ ముఠా అరెస్టు
4 Lawrence Bishnoi gang members planning to attack Salman Khan's car arrested#LawrenceBishnoi #SalmalKhan https://t.co/KbRgAX9tUC
— Pragativadi (@PragativadiNews) June 1, 2024