
Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రంలోని పూంఛ్ (Poonch) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాల్‌నోయ్ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొక 8 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఈ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
సత్వర స్పందన దళాలు,జమ్ముకశ్మీర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
ఇదే తరహా ప్రమాదం
ఇదే తరహా ప్రమాదం నవంబర్ 4న కూడా రాజౌరీ జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అక్కడ ఒక సైనిక వాహనం లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నవంబర్ 2న రేసి జిల్లాలో కూడా ఒక కారు లోయలోకి దూసుకెళ్లి, అందులో ఉన్న మహిళ, 10 నెలల బాలుడు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపడ్డారు.