Loading...
Governor Reshuffle:ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్

Governor Reshuffle:ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
10:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను తమిళనాడుకు బదిలీ చేసింది. ఇప్పటివరకు ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించగా.. తాజాగా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్‌ మాథూర్‌ను కేరళకు బదిలీ చేసింది. ఒడిశా గవర్నర్‌గా బ్రజ్‌మోహన్‌ రామ్‌ను నియమించింది. కర్ణాటక గవర్నర్‌గా డా. సుధా యాదవ్‌, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా డా. ఢాల్‌ సింగ్‌ బైసెన్‌, సిక్కిం గవర్నర్‌గా దుశ్యంత్‌ గౌతమ్‌ను నియమించింది. ఈ నియామకాలు, బదిలీలకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి భవన్‌ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..

ADVERTISEMENT