తదుపరి వార్తా కథనం
Telangana: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని కారు ఢీకొని.. నలుగురు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 22, 2023
09:49 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న దర్శనానికి గురువారం రాత్రి కారులో బయలుదేరి వెళుతున్న ఓ కుటుంబాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో వాహనంలో ఉన్న మంతెన కాంతమ్మ(72), మంతెన శంకర్(68), మంతెన భరత్(29), మంతెన చందన (16) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
కారులో ఉన్న తీవ్రంగా గాయపడిన రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.