Page Loader
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు

వ్రాసిన వారు Stalin
Jun 26, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన స్నేహితుడి గొంతు కోసి, రక్తాన్ని తాగేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాడి చేసిన వ్యక్తిని విజయ్‌గా, బాధితుడిని మారేష్‌గా పోలీసులు గుర్తించారు. అదృష్టవశాత్తూ మారేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడు విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆవేశంతోనే నిందితుడు మారేష్ గొంతు కోసినట్లు సమాచారం. విజయ్ చేస్తున్న ఈ దారుణాన్ని అతని స్నేహితుడు జాన్ అనే వ్యక్తి వీడియో తీశాడు.

కర్ణాటక

విజయ్‌పై కేసు నమోదు

జూన్ 19న విజయ్- మారేష్ నిర్మానుష్య ప్రదేశంలో కలుసుకున్నారు. ఈ క్రమంలో తన భార్యతో అక్రమ సంబంధంపై మారేష్‌తో విజయ్ వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన విజయ్ కోపంతో కత్తితో మారేష్ గొంతును కోశాడు. జూన్ 19న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో మారేష్‌ని విజయ్ ప్రశ్నించడం కనిపిస్తుంది. మారేష్ గొంతు కోసి, రక్తాన్ని విజయ్ తాగుతూ కనిపిస్తాడు. విజయ్‌పై కెంచర్లహళ్లి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.