Page Loader
కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 
కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి

కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
06:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముజప్పిలంగడ్‌లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడికి 11ఏళ్ల మూగ బాలుడు బలయ్యాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎడక్కాడ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలుడు నిహాల్, ఆదివారం రాత్రి తన ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం ప్రారంభించారు. ముజప్పిలంగాడ్ పట్టణంలో రాత్రి 8 గంటలకు ఆ బాలుడు ఓ మైదానంలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కేరళ

వీధికుక్కలను చంపడం పరిష్కారం కాదు: ముఖ్యమంత్రి విజయన్

చాలా గంటలు ఆ ప్రాంతాన్ని శోధించిన తర్వాత బాలుడి మృతదేహం కనపడినట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. బాలుడి శరీరంపై కుక్క కాటుకు గురైనట్లు కనిపించే గుర్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు వివరించారు. గత ఏడాది కేరళలోని కొట్టాయంలో ఇదే తరహాలో 12 ఏళ్ల మైనర్ కూడా వీధి కుక్కల దాడిలో మరణించాడు. ఈ వీధికుక్కల ఘటనలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, వీధికుక్కలను చంపడం సమస్యకు ఆచరణీయమైన పరిష్కారం కాదని, శాస్త్రీయమైన పరిష్కారం కావాలని పేర్కొన్నారు. ఇలాంటి కుక్కల దాడులు ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అకస్మాత్తుగా పెరిగాయి, కొన్ని ఘటనల్లో మనుషులను చంపుతున్నాయన్నారు.