LOADING...
Brazil vs Mexico: ఈ కుక్క మామూలిది కాదు బాస్..దీని కోసం కోసం కొట్టుకుంటున్న రెండుదేశాలు..ఈ డాగ్‌కు అంత క్రేజ్ ఏంటి?
కారామెల్‌ శునకంపై బ్రెజిల్‌-మెక్సికో మధ్య వివాదం.. అసలు యజమాని ఎవరు?

Brazil vs Mexico: ఈ కుక్క మామూలిది కాదు బాస్..దీని కోసం కోసం కొట్టుకుంటున్న రెండుదేశాలు..ఈ డాగ్‌కు అంత క్రేజ్ ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ వీధి శునక జాతిగా గుర్తింపు పొందిన 'పెర్రో కారామెలో' ప్రస్తుతం బ్రెజిల్‌-మెక్సికో దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ శునక జాతి తమ దేశానికే ప్రత్యేకమైందని బ్రెజిల్‌ వాదిస్తుండగా, మెక్సికో మాత్రం దానిని తమ జాతీయ గుర్తింపులో భాగంగా పేర్కొంటూ ముందుకొచ్చింది. ముదురు గోధుమ రంగులో కనిపించే ఈ శునకాన్ని సాధారణంగా 'కారామెల్‌ డాగ్‌' అని పిలుస్తారు. బ్రెజిల్‌లో ఇది కేవలం ఒక కుక్క జాతి మాత్రమే కాదు, అక్కడి చరిత్ర, సంస్కృతి, సామాజిక జీవన విధానానికి ప్రతీకగా కూడా భావిస్తారు. దాదాపు 300 రకాల శునక జాతుల కలయికతో ఈ జాతి ఏర్పడిందనే నమ్మకం బ్రెజిల్‌వాసుల్లో ఉంది.

వివరాలు 

ప్రతిపాదనకు 50 వేల మందికిపైగా మద్దతు

కొన్ని శతాబ్దాల క్రితం పోర్చుగల్‌, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, జపాన్‌ తదితర దేశాల నుంచి బ్రెజిల్‌కు వలస వచ్చిన ప్రజలు తమ పెంపుడు కుక్కలను వెంట తీసుకువచ్చారని చెబుతారు. కాలక్రమేణా ఆ జాతులు పరస్పరం కలవడంతో ప్రస్తుతం కనిపిస్తున్న కారామెల్‌ శునక జాతి రూపుదిద్దుకుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ శునకానికి బ్రెజిల్‌లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా గతంలో దేశ కరెన్సీ నోట్లపై కారామెల్‌ శునక చిత్రాన్ని ముద్రించాలని ఆన్‌లైన్‌లో ఒక పిటిషన్‌ ప్రారంభించారు. ఆ ప్రతిపాదనకు 50 వేల మందికిపైగా మద్దతు తెలపడం విశేషం.

వివరాలు 

మెక్సికో సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ జాతి కీలక పాత్ర

ఇదిలా ఉండగా, మెక్సికో ప్రభుత్వానికి చెందిన పర్యావరణ సంస్థ 'ప్రొపీమ్‌' ఇటీవల కారామెల్‌ శునక జాతిని దేశ నాలుగో జాతీయ చిహ్నంగా గుర్తించింది. మెక్సికో సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ జాతి కీలక పాత్ర పోషిస్తోందని సంస్థ పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై బ్రెజిల్‌లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున స్పందిస్తున్న బ్రెజిల్‌ పౌరులు, కారామెల్‌ శునకం తమ దేశ వారసత్వంలో భాగమని అంటున్నారు. ఈ జాతితో మెక్సికోకు ఎలాంటి చారిత్రక సంబంధం లేదని, కారామెల్‌ శునకాన్ని బ్రెజిల్‌ గుర్తింపుగా ప్రపంచం గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement