LOADING...
Iran: కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడి.. అమెరికా పేట్రియాట్ క్షిపణే కారణమన్న ఇరాన్
కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడి.. అమెరికా పేట్రియాట్ క్షిపణే కారణమన్న ఇరాన్

Iran: కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడి.. అమెరికా పేట్రియాట్ క్షిపణే కారణమన్న ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. విమానాశ్రయ టెర్మినల్‌పై జరిగిన దాడికి అమెరికా తయారు చేసిన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రతినిధి హుస్సేన్ మొహబ్బీ మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌పై జరిగిన ఘటనకు ఇరాన్ వైమానిక దళంతో ఎలాంటి సంబంధం లేదని అంతర్గత విచారణలో తేలిందని ఆయన తెలిపారు. కువైట్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని తమ బలగాలు ఎలాంటి దాడులు నిర్వహించలేదని స్పష్టం చేశారు. అమెరికా పేట్రియాట్ రక్షణ వ్యవస్థ ఇరాన్ డ్రోన్‌లను అడ్డుకోవడంలో విఫలమైందని హుస్సేన్ మొహబ్బీ ఆరోపించారు.

వివరాలు 

ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలు  అవాస్తవం:  అమెరికా సెంట్రల్ కమాండ్

ఆ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే ప్రయాణికుల టెర్మినల్ ధ్వంసమైందని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పూర్తిగా ఖండించింది. ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని ఎక్స్ వేదికగా వెల్లడించింది. కువైట్‌లోని పౌర విమానాశ్రయంపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే డ్రోన్‌లతో దాడి చేసిందని ఆరోపించింది. ఈ చర్యను అన్యాయమైనదిగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా, విమానాశ్రయంపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందగా, 63 మంది గాయపడ్డారు. ఘటన అనంతరం విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కువైట్ ఎయిర్‌పోర్టు దాడికి తమకు సంబంధం లేదన్న ఇరాన్

Advertisement