Gang rape: హైదరాబాద్‌లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి!
హైదరాబాద్‌లోని తార్నాకలో మహిళపై గ్యాంప్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నలుగురు వ్యక్తులు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. డిసెంబర్ ఏడో తేదీ రాత్రి బస్టాండ్‌లో నిల్చొని ఉన్న మహిళలకు ఏసు అనే వ్యక్తం మాయ మాటలు చెప్పి, ఆమెను లాలాగూడ వెళ్లాలని తెలుసుకున్నాడు. అక్కడికే తాను వెళ్తున్నానని చెప్పి ఆమెను లాలాగూడ్ లో దించకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చేరుకున్న తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు.
పోలీసుల అదుపులోకి నిందితులు
అనంతరం ఆమెను అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులైన మధు, ప్రశాంత్, రోహిత్, ఏసులను పోలీసులు పట్టకున్నారు. ఏసుఅనే వ్యక్తి మెకానిక్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు పేర్కొంది.