Absolute disgrace: నేటి 'నీట్ పీజీ' వాయిదా.. పెల్లుబికిన ఆగ్రహం
ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్)వాయిదా పడింది. కాగా ఈ పరీక్షకు హాజరుకావాలని చూస్తున్న విద్యార్థులు, ఈ ఆకస్మిక ప్రకటనతో పూర్తిగా షాక్‌కు గురయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయంతో పరీక్షకు సిద్ధమైన వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే పోటీ పరీక్షల NEET-UG , UGC-NETలో అవకతవకలు జరిగాయని వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, పరీక్ష పవిత్రతను కాపాడేందుకే వాయిదా వేయడాన్ని కేంద్రం సమర్థించింది.
నీట్-పీజీ వాయిదాపై విద్యార్థులు అసంతృప్తి
ఈ నిర్ణయంపై వైద్య వర్గాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. డాక్టర్ పెషీన్ అహమద్ తన నిరాశను వ్యక్తం చేస్తూ, ఈ పరీక్షను రద్దు చేయడానికి ఎటువంటి కారణం లేదని, ఇది తగిన సమయంలో నిర్వహించాలని పేర్కొన్నారు. RDA AIIMS వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సువ్రాంకర్ దత్తా "ఇది వైద్యులపై వేధింపులు" అని అన్నారు. నెలల ముందు ప్రణాళికాబద్ధమైన పరీక్షను నిర్వహించడంలో ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రశ్నించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) మాట్లాడుతూ "పరీక్షా వాయిదా పై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము!"
NEET-PG పరీక్ష ప్రక్రియలను అంచనా వేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ, శనివారం అర్థరాత్రి పోస్ట్‌లో, ఆదివారం (జూన్ 23) కొద్ది గంటల తర్వాత నిర్వహించాల్సిన నీట్-పిజి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. "తదనుగుణంగా రేపు అంటే జూన్ 23, 2024న నిర్వహించాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ముందుజాగ్రత్త చర్యగా వాయిదా వేయాలని నిర్ణయించాం" అని ఎక్స్‌లో ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. ఈ పరీక్ష తాజా తేదీని వీలైనంత త్వరగా తెలియజేయనుంది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తోంది."
నాయకత్వ మార్పు,పరీక్షల వివాదాల మధ్య NTAలో మార్పులు
నీట్ చుట్టూ ఉన్న వివాదాలు UGC-NET పరీక్ష రద్దు నేపథ్యంలో, కేంద్రం శనివారం NTA చీఫ్ సుబోధ్ కుమార్ సింగ్ స్థానంలో రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS) అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. అదే సమయంలో, పేపర్ లీక్‌లు పబ్లిక్ పరీక్షల్లో మోసాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 నుండి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టం, 2024ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.