
Japan visa: భారత విద్యార్థులకు జపాన్ శుభవార్త.. స్టూడెంట్ ఐడీ వీసా జారీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ విద్యార్థులు ఇక నుంచి జపాన్ వీసా పొందడం చాలా ఈజీ అని ఆ దేశ రాయబారి హిరోషి ఎఫ్ సుజుకి పేర్కొన్నారు.
ఆయన ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు.
భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనల సడలింపు గురించి కూడా ఆయన మాట్లాడారు.
భారత విద్యార్థులు జపాన్ వీసాను పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నారు.
కేవలం స్డూడెంట్ ఐడీని చూపించి విద్యార్థి వీసాను పొందొచ్చని పేర్కొన్నారు.
భారతదేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన మూడేళ్లలోపు భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనల సడలింపు వరిస్తుందని చెప్పారు.
వీసా
జపాన్‌లో చదవు, పనిపై ఆలోచించండి: రాయబారి
భారతదేశంలోని విద్యార్థులు, యువత జపాన్‌లో చదువుకోవడం, పని చేయడం గురించి ఆలోచించాలని రాయబారి కోరారు.
యువ సందర్శకులను ఆకర్షించేందుకే ఈ సడలింపులు చేసినట్లు సుజుకి వెల్లడించారు.
విద్యార్థులు స్వల్పకాలిక బస కోసం వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా దరఖాస్తులో ఆర్థిక వివరాలను సమర్పించడానికి బదులుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ను అందజేస్తే సరిపోతుందని ఆయన వివరించారు.
ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, యువకులు జపాన్‌కు వెల్లడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు.
అలాగే భారతీయ వంటకాలను కూడా హిరోషి సుజుకి పొగడ్తలోతో ముంచెత్తారు. భారతీయ ఆహారం తింటుంటే తినాలనిపిస్తోందన్నారు. చాలా రుచికరంగా ఉంటుందన్నారు.