Chinese Robot Dogs Row: ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీపై కేంద్రం చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అత్యంత గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక విశ్వవిద్యాలయం వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతర్జాతీయ స్థాయి నేతలు, ప్రతినిధులు, ప్రముఖ టెక్ సంస్థల సీఈఓలు హాజరవుతున్న ఈ సదస్సులో చోటు చేసుకున్న చైనా రోబో డాగ్ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న గల్గోటియాస్ యూనివర్సిటీ, దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఒక స్టాల్ ఏర్పాటు చేసింది.
వివరాలు
'గో2' పేరుతో అదే రోబో డాగ్‌ను విక్రయిస్తున్న యూనిట్రీ సంస్థ
తమ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రోబో డాగ్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ, 'ఒరియన్' అనే పేరుతో దానిని ప్రదర్శించింది. ఆ రోబో పనితీరును వివరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఆ రోబో డాగ్‌ను చైనాకు చెందిన రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసినదిగా నెటిజన్లు గుర్తించారు. యూనిట్రీ సంస్థ 'గో2' పేరుతో అదే రోబో డాగ్‌ను విక్రయిస్తోంది. భారత్‌లో కూడా ఆ ఉత్పత్తికి అనుమతి ఉండటంతో, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని సమాచారం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
ఈవిషయాన్ని గుర్తించిన నెటిజన్లు, విదేశీ సాంకేతికతను భారతీయ ఆవిష్కరణగా ప్రచారం చేస్తున్నారంటూ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవివాదంపై గల్గోటియాస్ యూనివర్సిటీ స్పందించింది.ఆ రోబో డాగ్‌ను చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని,విద్యార్థులు నేర్చుకునేందుకు ఒక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నామని తెలిపింది. తామే దానిని అభివృద్ధి చేశామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో యూనివర్సిటీ ప్రతినిధులు రోబో డాగ్‌ను తామే అభివృద్ధి చేసినట్లు చెప్పినట్టు కనిపించడం గమనార్హం. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. సదస్సు నుంచి గల్గోటియాస్ యూనివర్సిటీని బహిష్కరించి,వారికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో వివాదాస్పద ప్రదర్శన.. యూనివర్సిటీ స్టాల్ తొలగింపు
Galgotias University strikes again.
— Mohit Chauhan (@mohitlaws) February 18, 2026
This is the Helsel Striker V3 soccer drone, made in South Korea.
But they shamelessly claimed that it was innovated at Galgotias University and presented it at the AI Summit in Delhi.
I have no words.
pic.twitter.com/D1HZWzh2ai