Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్‌లో నిరంతరం గేమ్‌లు ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలుడు ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి అలవాటు పడ్డాడు. గురువారం రాత్రి తండ్రి అతడిని మందలించి ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వంటగదిలో ఉరి వేసుకుకున్నాడు. వంటగదిలో వేలాడుతూ కనిపించిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బోరివలిలోని భగవత్ ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు
ఇలా చేస్తే మొబైల్ వ్యసనం నుంచి పిల్లలు విముక్తి
మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను బయపడేలా చేయడానికి తల్లి దండ్రులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. పిల్లలను వీలైనంత ఎక్కువ సేపు ఫొన్‍కు దూరంగా ఉంచాలి. సాంకేతికత వల్ల ఉపయోగాలు, నష్టాల గురించి వారు తెలుసుకునేలా బహిరంగ చర్చల్లో పాల్గొనేలా చేయాలి. భోజనం, కుటుంబ సమయం, నిద్రవేళ వంటి వాటికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి. పిల్లలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. అంటే క్రీడలు, కమ్యూనిటీ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. మొబైల్‌ను ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, దీన్ని అధికంగా వాడటం వల్ల కలిగే నష్టాలపై పిల్లలకు వివరంగా చెప్పాలి. ఈ అంశంపై పిల్లలు చర్చించాలి.