Loading...
Sikkim on Alert : నేపాల్ వరదలతో అప్రమత్తమైన సిక్కిం.. సరస్సులపై సెన్సర్ల నిఘా
నేపాల్ వరదలతో అప్రమత్తమైన సిక్కిం.. సరస్సులపై సెన్సర్ల నిఘా

Sikkim on Alert : నేపాల్ వరదలతో అప్రమత్తమైన సిక్కిం.. సరస్సులపై సెన్సర్ల నిఘా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో హిమాలయ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో వందల సంఖ్యలో గ్లేసియర్ సరస్సులు ఉన్న సిక్కింలో అధికారులు అప్రమత్తమయ్యారు. సిక్కింలో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 400 గ్లేసియర్ సరస్సులు ఉన్నాయి. వీటిలో 16 సరస్సులను అత్యంత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో 13 ఉత్తర సిక్కింలో ఉండగా.. మరో మూడు పశ్చిమ సిక్కింలో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సులపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది.

వివరాలు 

గ్లేసియర్ సరస్సులు ఎందుకు ప్రమాదకరం?

సెన్సర్లు, ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

హిమానీనదాలు క్రమంగా కరిగి వెనక్కి వెళ్లే సమయంలో ఏర్పడిన గుంతల్లో నీరు చేరడంతో గ్లేసియర్ సరస్సులు ఏర్పడతాయి.

ఈ నీటిని మంచు, రాళ్లు, మట్టి వంటి సహజ నిర్మాణాలు అడ్డుకుంటుంటాయి.

అయితే ఈ సహజ అడ్డుకట్టలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయని చెప్పలేం.

మంచు చరియలు విరిగిపడటం, కొండచరియలు విరిగిపడటం, భూకంపాలు లేదా మంచు, రాళ్లలో అకస్మాత్తుగా కదలికలు రావడం వల్ల సరస్సుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.

సహజ అడ్డుకట్ట తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్తుంది.

దీనినే గ్లేసియర్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు.

వివరాలు 

గ్లేసియర్ సరస్సులు ఎందుకు ప్రమాదకరం?

ఈ వరదల్లో నీటితో పాటు బురద, రాళ్లు, చెట్లు, ఇతర శిథిలాలు కూడా కొట్టుకొస్తాయి.

దీంతో దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

నేపాల్‌లో ఇటీవల జరిగిన ఘటన హిమానీనదాలకు సంబంధించిన మార్పులు ఎంత వేగంగా భారీ వరదగా మారగలవో మరోసారి చూపించింది.

ఈ పరిణామాలపై సిక్కిం స్టేట్ రిలీఫ్ కమిషనర్ రింజింగ్ ఛెవాంగ్ స్పందిస్తూ.. నేపాల్‌లో జరిగిన ఘటనకు, సిక్కింలో 2023లో జరిగిన విపత్తుకు కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పారు.

నేపాల్‌లో భారీ హిమానీనదం కూలి నదికి అడ్డుగా మారింది. ఆ తర్వాత అడ్డంకి తెగిపోవడంతో ఒక్కసారిగా వరదలు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలను తీవ్రంగా ముంచెత్తాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

2023లోనే సిక్కింలో భారీ GLOF

సిక్కింకు గ్లేసియర్ సరస్సుల ముప్పు కొత్తదేమీ కాదు.

2023 అక్టోబరులో సౌత్ లోనాక్ సరస్సు అడ్డుకట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు బయటకు వచ్చింది.

ఈ వరద నీరు తీస్తా నదీ పరివాహక ప్రాంతంలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సౌత్ లోనాక్ సరస్సులోకి హిమానీనదంలోని కొంత భాగం పడిపోవడంతో భారీగా వరద నీరు పక్కకు తొలగిపోయిందని ఛెవాంగ్ వివరించారు.

అలా బయటకు వచ్చిన పెద్దమొత్తంలో నీరు వరదకు కారణమైందని చెప్పారు.

2023 ఘటన తర్వాత సిక్కిం ప్రభుత్వం గ్లేసియర్ సరస్సులపై మరింత లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించింది.

2023 ఘటన తర్వాత ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిక్కిం తన సన్నద్ధతను మరింత పెంచుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్ని సరస్సులు ప్రమాదంలో ఉన్నాయి?

ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న గ్లేసియర్ సరస్సులను గుర్తించి,వాటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMA)సిక్కింలో 40అధిక ప్రమాదం ఉన్న గ్లేసియర్ సరస్సులను గుర్తించింది.

వీటిలో 16సరస్సులకు వర్గీకరణ పూర్తయింది. మరో 13 సరస్సులు ఇంకా వర్గీకరించాల్సి ఉంది.

వర్గీకరించిన వాటిలో ఏడు సరస్సులు అధిక ప్రమాదంలో ఉన్నట్లు అంచనా వేశారు.

ప్రమాదకరంగా గుర్తించిన 16 సరస్సుల్లో 13పై ఇప్పటికే శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం చేశారు.

వీటిలో ఎక్కువ సరస్సులు సముద్ర మట్టానికి సుమారు 17,000అడుగుల ఎత్తులో ఉన్నాయి.

సరస్సు లోతు, అందులో ఉన్న నీటి పరిమాణం, నీటిని అడ్డుకుంటున్న మొరైన్ నిర్మాణం ఎంత బలంగా ఉంది,మంచు చరియలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎంత ఉందనే అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

వివరాలు 

సెన్సర్లు ఏం చేస్తున్నాయి?

సరస్సులను అప్పుడప్పుడు పరిశీలించడం మాత్రమే కాకుండా.. వాటిలో చోటుచేసుకునే మార్పులను నిరంతరం గమనించేందుకు సిక్కిం చర్యలు చేపట్టింది.

చాలా సరస్సుల్లో సెన్సర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీటి ద్వారా సరస్సులో నీటి పరిమాణం పెరుగుతోందా? తగ్గుతోందా? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఉత్తర సిక్కింలో ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు.

సరస్సుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగితే అధికారులకు సమాచారం అందేలా ఈ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు.

జూన్‌లో సీ-డాక్ అభివృద్ధి చేసిన స్వదేశీ గ్లేసియర్ సరస్సుల పర్యవేక్షణ సాంకేతిక వ్యవస్థను సిక్కింకు అందించినట్లు సమాచారం.

వివరాలు 

సెన్సర్లు ఏం చేస్తున్నాయి?

ఇందులో సరస్సుల పరిస్థితిని స్వయంచాలకంగా అంచనా వేయడం, ప్రమాదాన్ని గుర్తించడం వంటి సదుపాయాలు ఉన్నాయి.

సెన్సర్లు నీటి మట్టంలో మార్పులను నిరంతరం నమోదు చేసి, ఆ సమాచారాన్ని పర్యవేక్షణ కేంద్రాలకు పంపగలవు.

అంతేకాకుండా ఉపగ్రహ కమ్యూనికేషన్, వరదల నమూనాలను ఉపయోగించి నీరు బయటకు వస్తే ఎంత ప్రాంతం మునిగే అవకాశం ఉంది? దిగువ ప్రాంతాలకు వరద నీరు ఎంత వేగంగా చేరుతుంది? అనే అంశాలను కూడా అంచనా వేయవచ్చు.

అయితే టెక్నాలజీతో GLOFను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. ప్రమాదకర మార్పులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమయం కల్పించడమే ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్యలు

సిక్కిం కేవలం పర్యవేక్షణకే పరిమితం కాలేదు. ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది.

షాకో చు ప్రాంతంలోని సరస్సు నీటి మట్టాన్ని 20 నుంచి 40 మీటర్ల వరకు తగ్గించేందుకు సౌర విద్యుత్‌తో పనిచేసే పంపులను ఉపయోగించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు.

అక్కడ బలహీనమైన మొరైన్ అడ్డుకట్ట వెనుక సుమారు 2.7 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా.

ప్రతిపాదిత పంపింగ్ ద్వారా సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని బయటకు పంపవచ్చని భావిస్తున్నారు.

దీంతో అడ్డుకట్ట తెగితే ఒక్కసారిగా దిగువకు వచ్చే నీటి పరిమాణాన్ని తగ్గించవచ్చు.

సౌత్-నార్త్ లోనాక్ సరస్సుల సముదాయానికి సంబంధించి మరో ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

వివరాలు 

ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్యలు

సరస్సుకు దిగువన సుమారు 24కిలోమీటర్ల దూరంలోని డోల్మా సాంపాంగ్ వద్ద రాళ్లు,సిమెంట్‌తో రిటెన్షన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

భారీ వరద వస్తే దాని వేగాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం.

2023లో సౌత్ లోనాక్ నుంచి వచ్చిన వరద ఉద్ధృతిని డోల్మా సాంపాంగ్‌లోని సుమారు 300హెక్టార్ల ప్రాంతం కొంతవరకు తగ్గించిందని నివేదికలు చెబుతున్నాయి.

గురుడోంగ్మార్ సరస్సు సముదాయంలోనూ భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు.

సరస్సుకు ఇబ్బంది కలగకుండా నీటిప్రవాహాన్ని నియంత్రించేందుకు మొరైన్ అడ్డుకట్ట చుట్టూ భద్రతా గోడ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

అలాగే మంచు చరియలు,కొండచరియలు విరిగిపడేలా చేసే వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా గమనించేందుకు డాప్లర్ వాతావరణ రాడార్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను కూడా సిక్కిం ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వివరాలు 

టెక్నాలజీ తదుపరి GLOFను ఆపగలదా?

సెన్సర్లు హిమానీనదం కూలిపోవడాన్ని లేదా సహజ అడ్డుకట్ట తెగిపోవడాన్ని ఆపలేవు.

కానీ సరస్సులో ఏం జరుగుతోందో ముందుగానే గుర్తించడంలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయి.

ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తే దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే ఖాళీ చేయించేందుకు అధికారులకు కొంత సమయం లభిస్తుంది.

హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టం కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత కీలకంగా మారుతున్నాయి.

సిక్కిం తన అనుభవాన్ని ఇతర ప్రాంతాలతో పంచుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది.

నేపాల్‌లో జరిగిన విపత్తు తర్వాత అక్కడి అధికారులతో GLOFను ఎదుర్కొనే అనుభవాన్ని పంచుకుంటామని సిక్కిం తెలిపింది.

వివరాలు 

టెక్నాలజీ తదుపరి GLOFను ఆపగలదా?

ఇదిలా ఉండగా.. నేపాల్‌కు సిక్కిం నుంచి సహాయక బృందాన్ని కూడా పంపించారు.

ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ గోలే వైద్యులు సహా సహాయక సామగ్రిని తీసుకెళ్లే స్వచ్ఛంద కార్యకర్తల బృందాన్ని పంపించారు.

సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి చెందిన ముగ్గురు అధికారులు, ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు సహా ఈ బృందంలో ఉన్నారు.

2023లో సిక్కింలో సౌత్ లోనాక్ సరస్సు విపత్తు సమయంలో భారత్‌తో పాటు నేపాల్, ఇతర ప్రాంతాల నుంచి కూడా సిక్కింకు సహాయం అందిందని గోలే గుర్తుచేశారు.

వివరాలు 

టెక్నాలజీ తదుపరి GLOFను ఆపగలదా?

ప్రజల ప్రార్థనలు, మద్దతు కూడా తమకు అందాయని తెలిపారు. అందుకే మానవతా దృక్పథంతో నేపాల్‌కు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

సిక్కిం నుంచి వెళ్లిన బృందం నేపాల్‌లో సహాయక సామగ్రిని అందించడంతో పాటు పరిస్థితిని అంచనా వేయనుంది.

అవసరమైన చోట్ల అధికారులు చేపట్టే గాలింపు, సహాయక చర్యల్లోనూ ఈ బృందం సహకరించనుంది.

ADVERTISEMENT