PM Modi: 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని' ప్రారంభించిన ప్రధాని మోదీ
2024 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా 'X'లో తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంతో భర్తీ చేశారు. జూలై 28న తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో, PM మోడీ హర్ ఘర్ త్రివర్ణ ప్రచారం గురించి మాట్లాడారు. harghartirang.com వెబ్‌సైట్‌లో జాతీయ జెండాతో సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలని ప్రజలను కోరారు. శుక్రవారం, అయన తన ప్రొఫైల్ డీపీని మార్చారు.
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నడ్డా
"నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేయడం ద్వారా మన స్వతంత్ర దినోత్సవాన్నిజరుపుకోవడంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. అవును, https://hargartiranga.comలో మీ సెల్ఫీని షేర్ చేయండి" అని ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బిజెపి ప్రచారానికి "విస్తృతమైన సన్నాహాలు" చేసింది. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా దానిని విజయవంతం చేయాలని ఆఫీస్ బేరర్‌లందరికీ సూచించారు. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా యాత్ర చేపడుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీజేపీ కార్యక్రమం ఇదే . .
ఆగస్టు 12, 13, 14 తేదీల్లో స్వాతంత్య్ర సమరయోధులు, యుద్ధ స్మారక చిహ్నాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామని చుగ్ తెలిపారు. ఆగస్టు 14న విభజన సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లో మౌనదీక్షలు నిర్వహిస్తామని చుగ్ తెలిపారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని, దీని వల్ల దేశమంతా కుంకుమ, తెలుపు, పచ్చ సముద్రంలా మారుతుందని బీజేపీ నేత తెలిపారు. దేశంలోని ప్రతి బూత్‌కు త్రివర్ణ పతాకం చేరేలా చూడడమే పార్టీ ధ్యేయమన్నారు.