
AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా కూడా ఏఐతో అబ్బురపరిచారు. ఏఐ సాయంతో వికాస్ మోనాలిసాను రుచికరమైన భారతీయ ఆహారాన్ని తినేలా చేశాడు.
ఏఐ ద్వారా సృష్టించిన ఈ ఫోటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. వివిధ భారతీయ వంటకాలతో నిండిన టేబుల్ ముందు కూర్చున్న లియోనార్డో డావిన్సీ ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసాను ఆ ఫోటోలో మనం చూడవచ్చు.
"మోనాలిసా భారతీయ ఆహారాన్ని తింటోంది," అని అతను ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఏఐ
సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు
చెఫ్ వికాస్ ఖన్నా మోనాలిసా ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్‌కు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మోనాలిసా ఈ విధంగా తినడం కొనసాగిస్తే బరువు పెరుగుతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆమె ఏం తింటోందని మరోకరు ప్రశ్నించారు. అందులో సమోసా, జిలేబీ లేనందున నిరాశపడినట్లు ఇంకొకరు కామెంట్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని, మంచి పరిణామం అంటూ మరికొందరు కామంట్లు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వికాస్ ఖన్నా చేసిన ట్వీట్
Ok I did this with AI.
— Vikas Khanna (@TheVikasKhanna) June 3, 2023
Mona Lisa enjoying Indian Food. 😜 pic.twitter.com/sCCUZT5K9Z