TG News: కేంద్రంపై ఒత్తిడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ముందుకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, ముసీ నది పునరుజ్జీవనం, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రాజెక్టుల గురించి విన్నవించారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం పార్లమెంట్‌లో ఎంపీలు ప్రస్తావించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
ఈ క్రమంలో ప్రజాభవన్‌లో మార్చి 8న (శనివారం) అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ భేటీకి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు.
వివరాలు
అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానం తెలిపారు.