EC: పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్లు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఓటర్లుగా నమోదు కావడానికి ఫాం-18 వినియోగించుకోవాలని ఈసీ సూచించింది.నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించబడుతుంది. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. అలాగే, ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఇదే విధంగా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.