Page Loader
10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్

10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే దేశాధినేతలు దిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో స్కైడైవింగ్ జరిగినప్పటికీ జీ20 సదస్సు నేపథ్యంలో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. G20 2023 జెండాను పట్టుకొని గజానంద్ యాదవ్ చేసిన అద్భుత ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీ20 సమ్మిట్ కి 40 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హజరవుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

G20 జెండా పట్టుకొని అద్భుత ప్రదర్శన చేసిన ఐఏఎఫ్ అధికారి