Page Loader
Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా 
Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా 

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బిహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటనను మరో తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపైబీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆదివారం అమిత్ షా తెలంగాణ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అమిత్ షా పర్యటనలో భాగంగా కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో బహిరంగ సభల కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలో అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ టూర్ రద్దు